GDWL: గట్టు మండలం గొర్లఖార్దొడ్డి సమీపంలోని భరత్మాల జాతీయ రహదారిపై ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి దేవరపోతును బలంగా ఢీకొట్టడంతో అది అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గ్రామానికి రక్షణగా భావించే దేవరపోతు మృతితో స్థానికులు ధర్నా చేపట్టారు.