NRML: ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా సారంగాపూర్ ఉప అటవీ క్షేత్రాధికారి ఎండి నజీర్ ఖాన్ రాష్ట్ర స్థాయి ఉత్తమ అటవీ అధికారిగా ఎంపికయ్యారు. అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాల్లో విశేష కృషికి ఈ అవార్డు దక్కింది. మార్చి 23న హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో మంత్రి కొండ సురేఖ తదితరుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.