NDL: ప్యాపిలి మండలం పీఆర్ పల్లిలో సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ఏపీ రైతు సంఘం నేతలు అరటి పంటను ఇవాళ పరిశీలించారు. యుద్ధ ప్రభావంతో టన్ను రూ.20 వేల ధర, రూ.4 వేలకే పడిపోయిందని పేర్కొన్నారు. కోతకు వచ్చిన పంటను అమ్మలేక రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.23 వేల గిట్టుబాటు ధర ఇచ్చి, డోన్ మార్కెట్ శీతల గోదాంలలో నిల్వ చేయాలని కోరారు.