KMM: బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రేపటి నుంచి ఈనెల 26 తేదీ వరకు మండలస్థాయి క్రికెట్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గాలి దుర్గారావు ఇవాళ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు పాల్గొన్నారు. క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.