ASR: గత రెండు రోజులుగా కురుస్తున్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి కొయ్యూరు మండలంలోని శరభన్నపాలెం నుంచి చింతపల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో భారీ వృక్షాలు కూలిపోయాయి. రహదారికి అడ్డంగా చెట్లు పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు, వాహనదారులు తెలిపారు. చెట్లు అడ్డంగా ఉండడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు.