TG: కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నిష్కళంకమైన నేత అని BRS ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఆయనను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. అధిష్టానం అనుమతిస్తే తానే స్వయంగా వెళ్లి ఆయనను పార్టీలోకి తీసుకొస్తానని, అవసరమైతే భుజాన మోస్తానని వ్యాఖ్యానించారు. గన్మెన్లు, ఆర్భాటాలు లేకుండా సామాన్యంగా తిరిగే ఆయన వ్యక్తిత్వం ఆదర్శమన్నారు.