ELR: జీలుగుమిల్లి మండలం దర్భ గూడెం శివారు పండు వారి గూడెం గ్రామంలో ఇవాళ శ్రీ సీతారాముల ఆలయం నూతన విగ్రహాల పున ప్రతిష్ట నిర్వహించారు. శ్రీ సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వినాయకుని రాతి విగ్రహాలను ఎంపీటీసీ సున్నం సురేషు, గ్రామ సర్పంచ్ సున్నం ఉషారాణి దంపతులు నూతన ఆలయ పున ప్రతిష్ట చేసి ఆలయంలో ఆవిష్కరించారు.