ప్రకాశం: సింగరాయకొండ పరిధిలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్ రోడ్డు, అదితి బజార్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ పెరగడంతో పాటు, రోడ్లపైనే కార్లు, లారీలు ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రయాణం నరకప్రాయంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.