పెద్దపల్లి జిల్లాలోని ఆయా క్లస్టర్ల రైతు వేదికల నుంచి సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయా క్లస్టర్ రైతు వేదిక నుంచి బస్సులు బయలు దేరుతాయని తెలిపారు. ఆసక్తిగల రైతులు వ్యవసాయ విస్తరణ అధికారికి ఈరోజు సాయంత్రంలోగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.