KRNL: ఆలూరులో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజలు భారీగా ఇవాళ హాజరయ్యారు. పలు గ్రామాల ప్రజలు డ్రైనేజీ, సీసీ రోడ్లు, పెన్షన్ల సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలను శ్రద్ధగా విన్న జ్యోతి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చేస్తామని వెల్లడించారు.