నాగర్ కర్నూల్ పట్టణంలో ఈద్గా వద్ద రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముస్లిం సోదరులను కలిసి ప్రత్యేకంగా అలయ్ బలయ్ తీసుకున్నారు. రంజాన్ మాసం మతసామరస్యానికి ప్రతిక అని, అందరు సోదర భావంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణ రావు, తీగల సురేంద్ర, తదితరులు పాల్గొన్నారు.