GDWL: ధరూర్ మండలం నీలహళ్లిలో ఈనెల 27న శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను గోవిందారెడ్డి గురూజీ భక్తులతో కలిసి విడుదల చేశారు. లోకకళ్యాణం కోసం జరిగే ఈ మహోత్సవంలో భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.