GDWL: పవిత్రత నియమనిష్టలకు ప్రతీకగా రంజాన్ నిలుస్తుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని ఉండవెల్లి మండలం పుల్లూరులోని మసీదు వద్ద శనివారం ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం ఆయన ముస్లింలను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.