HYD: శంషాబాద్ ఎయిర్‌ఫోర్ట్ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ బయలుదేరిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో తిరిగి వెనక్కి మళ్లింది. జగదల్పూర్ ఎయిర్పోర్ట్ ల్యాండింగ్‌కు ప్రతికూల పరిస్థితులు ఉండటంతో అధికారులు విమానాన్ని తిరిగి శంషాబాద్లోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలోని 92 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.