MDK: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంత్రాలు, క్షుద్ర పూజలను నమ్మవద్దని రామాయంపేట ఎస్సై బాలరాజు సూచించారు. శుక్రవారం రాత్రి మండల పరిధిలోని పర్వతాపూర్ గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై దాడులు, బాలల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలపై అవగాహన కల్పించారు.