KMR: బాన్సువాడ మండలం పులిగుండు తండాలో పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాల కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పశువులకు చికిత్సలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు టీకాలు ఎంతో అవసరమని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ఓఎస్ ఖాదర్, గోపాల మిత్ర ప్రవీణ్, సర్పంచ్ రామారావు, పంచాయతీ సెక్రెటరీ శివరాజ్ పాలుగోన్నారు.