SRCL: వీర్నపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో శనివారం గుగులోతు గోపాల్ అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోపాల్ అప్పుల బాధతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.