W.G: భీమవరం టీడీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొని వినతులు స్వీకరించారు. స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ సుజాత, కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.