TG: రంజాన్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక దైవప్రార్థనలు, ఉపవాస దీక్షలు, శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమ పరిమళిస్తాయని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.