అన్నమయ్య: రెవెన్యూ శాఖ తమ ఆదాయ లక్ష్యాలను అధిగమించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను సూచించారు. శుక్రవారం మదనపల్లెలోని కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణ, మైనింగ్, రిజిస్ట్రేషన్, అటవీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వాణిజ్య కార్యకలాపాలు, వస్తువుల సేవల వినియోగంపై జీఎస్టీ వసూళ్లు పక్కాగా జరగాలని ఆదేశించారు.