AP: విజయనగరం(D) రామభద్రపురం(M) తారాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక టైర్ పేలి ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. భువనేశ్వర్ నుంచి మల్కాజిగిరికి వెళ్తున్న ఒడిశా ట్రావెల్స్ బస్సు టైర్ పేలగానే డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందికి దించాడు. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం.