ADB: పట్టణంలో గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు. శుక్రవారం జరిగిన దాడుల్లో రాంనగర్‌కు చెందిన రాజ్‌కుమార్, భీంపూర్ మండలానికి చెందిన నాగోరావ్, శ్రీనివాస్ పై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వారి నుంచి ఎండు గంజాయితో పాటు 9 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.