TG: రాష్ట్రంలో విద్యా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం రూ.1,011 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా PP-2 నుంచి ఇంటర్ వరకు 11 కొత్త పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. మరో 17 స్కూళ్లను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 164 పాఠశాలల్లో 501 అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టనున్నారు.