KNR: నగరంలో శుక్రవారం రాత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ సందడి చేశారు. ఈ క్రమంలో ఆయన నగరంలోని ఓ సినిమా థియేటర్లో విడుదలైన ‘దురంధర్-2’ చిత్రాన్ని అభిమానులు, పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందించిన ఆయన, సినిమా ఆకట్టుకునేలా ఉందన్నారు. కేంద్ర మంత్రి రాకతో థియేటర్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది.