ATP: అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జనగణన 2027 శిక్షణ కేంద్రాన్ని DRO మాలోల పరిశీలించారు. తొలి దశ గృహ జాబితా నమోదుపై ఈ నెల 26 నుంచి 29 వరకు క్షేత్ర స్థాయి శిక్షకులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కంప్యూటర్ ల్యాబ్లో సదుపాయాలను తనిఖీ చేసి అధికారులకు సూచనలు ఇచ్చారు. మాస్టర్ ట్రైనర్లుగా ఎంపికైన అధ్యాపకులు శిక్షణ ఇస్తారని వెల్లడించారు.