WGL: ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా అభివృద్ధికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ను రెండు రోజుల్లో సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి లక్ష్యం సాధించాలని సూచించారు.