ప్రకాశం: గిద్దలూరు రైల్వే స్టేషన్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం సాయంకాలం రైల్వే కమ్మీలు దాటుతున్న సమయంలో ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు కింద పడిన ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.