SKLM: ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వారి సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేశారు. వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులని ఆదేశించారు.