GNTR: మంగళగిరికి చెందిన నవీన్ కుమార్ నవూరి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్లో పీహెచ్.డీ పట్టా పొందారు. డాక్టర్ సి.వి.పి.ఆర్. ప్రసాద్ పర్యవేక్షణలో “హైబ్రిడ్ డీప్ లెర్నింగ్” అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. ఈ సందర్భంగా తన విజయానికి సహకరించిన గురువులకు, వర్సిటీ సిబ్బందికి నవీన్ కృతజ్ఞతలు తెలిపారు.