NZB: జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) సెక్రటరీగా మోస్రా మండలానికి చెందిన పిట్ల శ్రీరాములు నియమితులయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.