CTR: సోమల మండలం పెద్దఉప్పరపల్లి M.P.P. స్కూల్లో ఈనెల 22న ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు శుక్రవారం నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం పుంగనూరులో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నానా బాల గణేష్, రాజారెడ్డి మాట్లాడారు. దగ్గర చూపు, దూరపు చూపు, కంటి పొర ఇలా కంటికి సంబంధించి వివిధ జబ్బులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.