నెల్లూరూలో రూ. 27 కోట్లతో చేపట్టిన 240 అభివృద్ధి పనులను ఈనెల 22న ప్రారంభించనున్నట్లు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు రూరల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ ఉంటుందన్నారు.