అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై వచ్చిన విన్నపాలను పరిశీలించి, ప్రాధాన్యతల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టాలను తీరుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.