ఖమ్మం నియోజకవర్గంలోని 47వ డివిజన్లో రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందించిన ఈద్ కా తోఫా కిట్లను ముస్లిం మత పెద్దల సమక్షంలో కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మసీదు సదర్ షేక్ జానిమియా, కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకుడు షేక్ జాకీర్ హుస్సేన్ పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు ఈ కిట్లను అందజేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.