BPT: అర్హులైన పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం, సాగుభూమి కల్పించాలనే డిమాండ్‌తో మార్చి 24న రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆందోళనలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. పట్టణాల్లో రెండు సెట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.