Sequel: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సీక్వెన్స్ మొదలైందా?
ఆడవారి మాటలకు అర్థాలే వేరు మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ హీరోయిన్ త్రిషకు చెప్పగా ఓకే చెప్పిందట.
Aadavari Matalaku Arthale Verule Sequel: తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన మూవీ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 2007లో విడుదలైన ఈ మూవీలో వెంకటేష్ , త్రిష జంటగా నటించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ చిత్రానికి ఇప్పుడు సీక్వెన్స్ తీయాలని అనుకుంటున్నారట. వెంకటేష్ కెరీర్లో మంచి విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ మూవీకి సీక్వెన్స్ తీస్తుండటం విశేషం.
ఈ విషయాన్నిఇన్ డైరెక్ట్ గా త్రిష చెప్పడం విశేషం. దర్శకుడు సెల్వ రాఘవన్ పదేళ్ల క్రితం ఓ ట్వీట్ చేయగా.. దానికి తాజాగా త్రిష రిప్లై ఇచ్చింది. ‘ ఇప్పుడే ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమా చూశాను. వెంకీ, త్రిష తో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. సీక్వెల్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి ఇప్పుడు త్రిష రిప్లై ఇచ్చారు. తాను సీక్వెన్స్ లో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటూ రిప్లై ఇవ్వడం విశేషం.
సెల్వరాఘవన్ ఇప్పటికే త్రిష వద్దకు వెళ్లి ఇదే విషయం అడగగా, ఆమె చేయడానికి అంగీకరించింది. ఈ ప్రాజెక్ట్ ని నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు వెంకటేష్ తో డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి అని తెలుస్తోంది. గతంలో ఈ చిత్రాన్ని తమిళంలో తన సోదరుడు, నటుడు ధనుష్‌తో ‘యారడి నీ మోహిని’గా రీమేక్ చేసిన సెల్వరాఘవన్ ఆ ప్రయత్నంతో విజయాన్ని చవిచూశారు. ఇప్పుడు తెలుగుతో పాటు, తమిళంలోనూ తెరకెక్కిస్తారా అనే విషయం తెలియాల్సి ఉ:ది.
సీక్వెల్ అయితే, ఈ విషయంలో అలాంటి కథ వారికి సెట్ అవుతుందా లేదో కూడా చూడాలి. త్రిష ఇప్పటికీ అందంగానే ఉంది. కానీ, వెంకటేష్‌కు అలాంటి కథలు నప్పుతాయా? ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో చూడాలి. ఆ సినిమాకు అప్పుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా, పాటలు బాగా క్లిక్ అయ్యాయి.