నిద్ర లేచింది మొదలు.. మళ్లీ నైట్ పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అందులో వాట్సాప్ లేకుంటే రోజు గడవదు. అందుకే వాట్సాప్ మంచి మంచి ఫీచర్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంది. తాజాగా వాట్సాప్ ఛానల్ అందుబాటులోకి తీసుకు రాగా స్టార్ హీరోలు చానల్ క్రియేట్ చేసుకుంటున్నారు.
WhatsApp channel: ఈ జనరేషన్ వాళ్లు వాట్సాప్ లేకుండా బతకడం కష్టం. అది, ఇది అని కాదు.. ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో మన దగ్గరికి చేర్చే ఏకైక సాధనం వాట్సాప్. అందుకే వాట్సాప్‌లో కొత్తగా వాట్సాప్ ఛానల్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవ్వరైన సరే ఈ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. అందులో తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వాట్సాప్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్లను మనం ఫోలో చేస్తే.. వాళ్లు మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పటికే హిందీలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, సన్నీ లియోన్.. మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు.
తెలుగులో వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసిన తొలి తెలుగు హీరోగా విజయ్ దేవరకొండ నిలిచాడు. సెప్టెంబర్ 6న ఛానల్ క్రియేట్ చేశాడు రౌడీ. ఆయనకు భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. దర్శక ధీరుడు రాజమౌళి కూడా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశారు. మామూలుగానే టెక్నాలజీని వాడడంలో ముందు వరుసలో ఉంటాడు రాజమౌళి. అందుకే వెంటనే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాడు. జక్కన్నతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాడు. దీంతో తమ తమ ఫేవరేట్ హీరోలను లక్షల్లో ఫాలో అవుతున్నారు అభిమానులు. దీని వల్ల నేరుగా తమ అభిమాన హీరోలు షేర్ చేసే ప్రతి అప్డేట్ను అరచేతిలో చూసుకోవచ్చు.