ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ సీరియస్‌గా హెచ్చరించింది. లీకుల విషయంలో.. సినిమాలో ఏదైనా భాగం, విజువల్స్, ఫుటేజ్, ఫోటోలను షేర్ చేసుకోవడం చట్టవిరుద్ధం.. అసవరమైతే సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ.. కాపీరైట్ లీగల్ నోటీస్ రిలీజ్ చేసింది.
Prabhas: ప్రస్తుతం బడా బడా మూవీ మేకర్స్‌ను భయపెట్టేలా చేస్తున్న సమస్య లీకులు. ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ సినిమాను కూడా లీకులు బెడద పట్టుకుంది. ఎవరు లీక్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి లీక్ అవుతుందనే విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు మేకర్స్. రీసెంట్గా ‘కల్కి’ నుంచి ఓ పిక్ ఒకటి బయటకొచ్చి వైరల్‌గా మారింది. ‘కల్కి’ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచే ఈ లీక్ జరిగినట్లు తెలియడంతో.. సదరు వ్యక్తిపై యాక్షన్ తీసుకున్నారు. నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారైతే ఏకంగా ఆ వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టారని, విఎఫ్ఎక్స్ కంపెనీపై పరువు నష్టం దావా వేశారని వార్తలొచ్చాయి.
ఇప్పుడు అఫిషీయల్‌గా లీగల్ కాపీ రైట్ నోటీస్ రిలీజ్ చేశారు. కల్కి సినిమా నుంచి ఎలాంటీ లీకులు చేసినా.. ఆ ఫోటోలు, ఫుటేజ్‌లను అనధికారికంగా ఎవరైనా షేర్ చేసినా.. కాపీరైట్ చట్టాల ద్వారా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే.. సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. అని సీరియస్‌గా హెచ్చరించారు. మరి ఇప్పటికైనా కల్కి లీకులు ఆగుతాయేమో చూడాలి. ఇకపోతే నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ప్రభాస్ నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన కల్కి ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయాయి. వచ్చే సమ్మర్లో కల్కి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.