TG ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డుల్లో నటుడు చిరంజీవికి NTR అవార్డు వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. NTR అంటే N నాట్యం, T తాళం, R రాగం.. కళల సమ్మేళనం అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘NTR నేషనల్ అవార్డు’ రావడం జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని రాసుకొచ్చాడు.