NZB: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియమ నిష్ఠలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.