CTR: యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. ఇప్పటికే 30 వేలకుపైగా నియామకాలు పూర్తిచేసి, వివిధ రంగాల్లో మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో పారదర్శకంగా నియామకాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.