MBNR: మిడ్జిల్ మండలం రాణిపేటలో సర్పంచ్ మాధవి అధ్యక్షతన శుక్రవారం గ్రామపంచాయతీ సమావేశం జరిగింది. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. వార్డు సభ్యులు తమ ప్రాంతాల్లోని సమస్యలను వివరించారు. ఈ సమావేశంలో కార్యదర్శి సుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు.