NTR: నందిగామ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి గాను జరగనున్న ఎన్నికలకు నామినేషన్ల పర్వం శుక్రవారం ప్రారంభమైంది. అధ్యక్ష పదవికి అభ్యర్థిగా సురేశ్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. తన కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కోర్టు ఆవరణలో న్యాయవాదుల సమక్షంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ అందజేశారు.