TG: విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు అసెంబ్లీలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో విద్యనందిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సీఎం, మంత్రులు విదేశీ పర్యటనలు చేశారని గుర్తుచేశారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2.7 శాతం ఎక్కువన్నారు.