MDK: రామాయంపేట అడవిశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఊర పిచ్చుకల దినోత్సవం నిర్వహించారు. ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేసవికాలం దృష్టిలో పెట్టుకొని ఊర పిచ్చుకలకు ఆహారం, త్రాగునీరు అందే విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.