TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(UG) ఇయర్ ప్యాటర్న్ అభ్యర్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా శనివారం జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు పరీక్ష విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ జరగనుందన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.