ATP: తాడిపత్రి ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మెసేజ్ రూపంలో హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్లు, టవర్లు, విద్యుత్ స్తంభాలు, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని స్పష్టం చేసింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొంది ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.