అసిఫాబాద్: కాగజ్ నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 5వ రాష్ట్ర మహాసభ కరపత్రాలను జిల్లా అద్యక్షులు వంగరి ప్రవీణ్ శుక్రవారం విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 24న సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. RTI కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.