NLR: జిల్లాలో 48వ డివిజన్ ఖతీజా మసీదు ఇఫ్తార్ విందులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మసీదు సోలార్ యూనిట్ కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఇమామ్లు, మౌజాంలకు రంజాన్ తోఫాగా నూతన వస్త్రాలు, రూ. 10 వేల నగదు అందజేశారు. ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింల సంక్షేమానికి పాటుపడతానని మంత్రి భరోసా ఇచ్చారు.