AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మైనర్ బాలికపై అత్యాచారం చేయడంతో.. బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.